Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనువాదానికి మరణశాసనం రాసిన వ్యక్తి అంబేద్కర్
- ఆయన ఆశయాల ఆచరణే నిజమైన నివాళి
- 'కులం, లింగ వివక్ష-అంబేద్కర్ అవగాహన' సెమినార్లో సీనియర్ సంపాదకులు సతీష్‌చందర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
'మార్క్స్, అంబేద్కర్ల ఆలోచనలను వేర్వేరుగా కాకుండా ఐక్యంగా చూడాలి. నేటి సమాజానికి లాల్‌నీల్ ఐక్యత అనివార్యం. ఆకలి, అన్నానికి మార్క్స్ వారధి అయితే అవమానం, అత్మగౌరవానికి వారిధి అంబేద్కర్. ప్రపంచ కార్మికులారా ఏకం కావాలని మార్క్స్ ఇచ్చిన పిలుపు కలగానే మిగిలింది. ఏకమైతేనే కదా దోపిడీ రాజ్యం కూలిపోయేది. మనువు మహిళలను అవమానిస్తే అదే మహిళలకు అంబేద్కర్ హక్కులు కల్పించి మనువాదానికి మరణ శాసనం రాశాడు' అని సీనియర్ సంపాదకులు సతీష్ చందర్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కులవివక్ష వ్యతిరేకపోరాట సంఘం (కేవీపీఎస్) హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో సంఘం నగర అధ్యక్షులు ఎం.దశరథ్ అధ్యక్షతన శుక్రవారం 'కులం, లింగ వివక్ష-అంబేద్కర్ అవగాహన' అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లా డారు. అంబేద్కర్‌కు అడుగుల్లో విగ్రహాలు పెట్టేవారి కంటే ఆయన అడుగు జాడల్లో నడిచేవాళ్లు కావాల న్నారు. ఆరాధీకులు కాకుండా ఆచరణవాదులుగా ఉండాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల గురించి అగ్రవర్ణాలవారు గగ్గోలు పెడుతున్నారని, రిజర్వేషన్ల వల్ల మంత్రసాని కూతురు నర్సు అయి ఆస్పత్రిలో మళ్లీ మంత్రసాని పనే చేస్తోందని, బంట్రోతు కొడుకు కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించి మళ్లీ బంట్రోతు పనే చేస్తున్నారని వివరించారు. పురుషునికి మహిళ ను బానిసగా చూపిస్తూ మనుస్మృతిలో మనువు రాస్తే, అదే మహిళకు సమానహక్కులు కల్పించాలని హిందూకోడ్ బిల్లు పెడితే ఆమోదించే దమ్ములేక అప్పటి ప్రధాని నెహ్రూ తిరస్కరించారని గుర్తు చేశారు. దీంతో అంబేద్కర్ నిరసనగా తన మంత్రి పదవినే తృణపాయంగా వదులుకున్నారని గుర్తు చేశారు. ఈ రోజుల్లో మంత్రులకు ఇలా చేసే దమ్ముం దా? అని ప్రశ్నించారు. బాల్య వివాహాలు, సతీసహగ మనాలను అడ్డుకునే విధంగా అంబేద్కర్ చట్టం చేశా రని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు పెరుగుతున్నాయని, కుల సమస్య దళిత మహిళలనే కాకుండా అగ్రవర్ణ మహిళలను సైతం వేధిస్తోందని, అందుకు ప్రణరు హత్యనే నిదర్శనమని అన్నారు. ఒకప్పుడు ఊరి చివరలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలు నడి ఊర్లోకి వస్తున్నాయని, ఆయన ఆలోచన విధా నాన్ని సహించలేని మనువాదులు విగ్రహాలను కూల్చేస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ ఆలోచన విధా నం, తత్వం తిరబడితే క్షేమంగా ఉంటారా? అని హెచ్చరించారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ కుల సమస్య కాన్సర్, ఎయిడ్స్ కంటే ప్రమాదకరమని అన్నారు. ఈ కులమనేది దేశం కోసం జీవితాన్నే త్యాగం చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే సహిస్తలేదన్నారు. అంబేద్కర్ జయంతిని ఐక్యరాజ్యసమితి ప్రపంచ విజ్ఞాన దినం గా ప్రకటిస్తే మనువాదులు మాత్రం ఆయన ఆలో చన విధానాన్ని అడ్డుకుంటున్నారని తెలిపారు. దేశా నికి పెబ్టుబడి దారీ విధానం, బ్రహ్మాణీయవాదం శుత్రువులుగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. పెట్టుబడిదారి విధానం అదానీ, అంబానీలను తయారు చేస్తే, బ్రహ్మాణీయవాదం హింసను ప్రేరేపిస్తూ దళితులపై దాడులు చేస్తున్నదని వివరిం చారు. అంతకుముందు అంబేద్కర్ చిత్రపటానికి సతీష్ చందర్ పూలమాలేసి నివాళలర్పించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నగర కార్యదర్శి సుబ్బారావు, నగర నాయకురాలు మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.