Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ పాలనలో శాస్త్రీయ విద్యావిధానానికి తూట్లు
- నూతన విద్యావిధానం ప్రమాదకరం :
- జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు అందె సత్యం
- ఎస్వీకే మూఢ నమ్మకాల నిర్మూలనా చట్టం కోసం రౌండ్ టేబుల్ సమావేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మూఢనమ్మకాలను సమర్ధవంతంగా తిప్పికొట్టి పారద్రోలే సాధనం చదువేనని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు అందె సత్యం అన్నారు. వాటి నియంత్రణకు ప్రభుత్వం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అంబేద్కర్ జయంతి సందర్భం గా ఆయన చిత్రపటానికి అందె సత్యంతో పాటు పలువురు పూలు చల్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అందె సత్యం మాట్లాడుతూ.. నేడు పాలకులు విగ్రహాలు పెట్టడంలో చూపుతున్న శ్రద్ధను ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చూపడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మూఢనమ్మకాలను మరింత పెంచేలా కేంద్రంలోని బీజేపీ ముందుకు పోతున్నదనీ, అందులో భాగంగానే శాస్త్రీయ విద్యావిధానానికి తూట్లు పొడుస్తూ నూతన విద్యావిధానం తీసుకొచ్చిందని విమర్శించారు. కుల వ్యవస్థను మరింత బలోపేతం చేసే ప్రయత్నంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ ఉన్నాయ న్నారు. వెనుకబడిన సామాజిక తరగతులకు చదువు నిరాకరిస్తే తిరుగుబాటు చేస్తారని అంబేద్కర్ ఆకాలంలో హెచ్చరించిన విష యాన్ని గుర్తుచేశారు. మనుధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ఆలోచ నలను ఎక్కడికక్కడ తిప్పికొట్టడమే అంబేద్కర్‌కు ఇచ్చే నివాళి అన్నారు. సమాజాభివృద్ధికి మూఢ నమ్మకాలు పెద్ద అవరోధంగా మారాయని వాపోయారు. మూఢనమ్మకాల నిర్మూలన కోసం జేవీవీ మరింత కృషి చేయాలని పిలుపు నిచ్చారు. జేవీవీ రాష్ట్ర అధ్యక్షులు కోయ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. అంబేద్కర్ జీవితాంతం కుల వివక్ష, అణచివేతకు వ్యతిరే కంగా పోరాడిన క్రమాన్ని వివరించారు. కుల నిర్మూలన కోసం ఆయన చేయని ప్రయత్నం లేదన్నారు. అందరికీ విద్య అందితేనే ప్రజల్లో చైతన్యం పెరుగుతుందన్నారు. మూఢ నమ్మకాల నిర్మూలనా చట్టం కోసం మరింత పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో జేవీవీ కోశాధికారి వరప్రసాద్, కార్యదర్శి రాజా, సీనియర్ నాయ కులు మాణిక్యాల రావు, భీమేశ్, నరేందర్‌రెడ్డి, జేవీవీ హైదరాబాద్ నగర అధ్యక్షులు చంద్రశేఖర్‌రావు, కార్యదర్శి లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.