Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాజ్యాంగ పరిరక్షణ కోసం జరిపే పోరాటమే బాబాసాహెబ్ అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న విగ్రహానికి చెరుపల్లి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటం చేయకుంటే పాలకవర్గాలు ఈ రాజ్యాంగాన్ని నిలబడనీయవంటూ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్‌లో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. దాన్ని వీలుగా కాపాడుకునేందుకు కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులు, మేధావులు, వివిధ సామాజిక తరగతులు, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులందరూ కలిసికట్టుగా బీజేపీ కుట్రలు, కుతం త్రాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాజ్యాం గంలోని మౌలిక సూత్రాలైన లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక స్వావలంబన, సామాజిక న్యాయం, ఫెడరలిజం దేశానికి మూల స్థంభాల న్నారు. వాటిని కాదని, కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం ఆధారంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చాతుర్వర్ణ విధానాన్ని అమలు చేస్తున్నదని విమర్శించారు. స్వాతంత్య్రోద్య మాన్ని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్నే కాకుండా మొత్తం భారతదేశ చరిత్రనే వక్రీకరిస్తున్నదని విమర్శించారు. ''మతం పేరుతో దేశంలో బీజేపీ విషం చిమ్ముతున్నది. గాంధీని చంపిన గాడ్సేను దేశ భక్తుడంటున్నారు. ఒక శాతం కుబేరుల వద్ద 40 శాతం దేశ సంపద పోగు పడింది. ఒక వైపు కార్పొరేట్ శక్తులు బలపడుతుంటే పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారు. నిరుద్యోగం పెరిగిపో తున్నది. ప్రయివేటీకరణ పేరుతో ప్రజల సొమ్మును ఆదానీకి, అంబానీలకు ధారాదత్తం చేస్తున్నారు. దళితులు, గిరిజనులు, మహిళలపై హత్యలు, అత్యా చారాలు, దాడులు జరుగుతున్నాయి... ''అని చెరు పల్లి ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించితే తప్ప ఇలాంటి వాటికి పరిష్కారం లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీ.జీ.నరసింహారావు, టి.సాగర్, జాన్ వెస్లీ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.వీ.రమణ, శ్రీరాంనాయక్, సీనియర్ నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి, నాయకులు సోమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, టీపీఎస్కే రాష్ట్ర నాయకులు జి రాములు తదితరులు ఉన్నారు.