Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విడిపించాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందే..
- కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే
- అంబేద్కర్వల్లే ఎస్సీలు, మహిళలకు ఓటు హక్కు
- 2024లో అధికారం కాంగ్రెస్‌దే : రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి, నస్పూర్
దేశ స్వాతంత్య్రం బీజేపీ సంకెళ్లలో బంధించబడిందని, దీన్ని విడిపించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావా ల్సిందేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ పని చేయడం కాంగ్రెస్ తప్ప ఎవరితోనూ సాధ్యం కాదన్నారు. జోడో యాత్రకు కొనసాగింపుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా శుక్రవారం మంచిర్యాలలో బహిరంగ సభ నిర్వ హించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సురేఖ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభకు ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. తొలుత డా. బిఆర్ అంబేద్కర్, మహత్మా జ్యోతిబాఫులే విగ్రహాలకు ఖర్గే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సభను ద్దేశించి మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి దేశా నికి దిశ చూపించారని తెలిపారు. అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించారని, ఆయనే లేకపోతే ఎస్సీలు, మహిళల కు ఓటు హక్కు వచ్చేది కాదని చెప్పారు. కొందరు ఎస్సీల పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నారని, వారి అవస రాలు మాత్రం తీర్చడం లేదని విమర్శించారు. పేదల అవస రాలను ప్రస్తుత ప్రభుత్వాలు విస్మరించాయన్నారు. అధికా రంలోకి వస్తే ఏటా 2లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మోడీ నిరుద్యోగులను మోసం చేశారని తెలిపారు. సింగ రేణిలోనూ గణనీయంగా ఉద్యోగాల సంఖ్యను తగ్గించార న్నారు. మోడీ నియంత పాలన సాగిస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీపై రాజకీయ కక్షసాధింపులో భాగంగానే అనర్హత వేటు వేసి రెండేండ్ల జైలు శిక్ష విధించా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, పేదలకు అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాణహిత- చేవెళ్లకు అంబేద్కర్ పేరు పెడితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు తొలగించా రని ప్రశ్నించారు. తొమ్మిదిన్నర ఏండ్లలో ఒక్కసారి కూడా అంబేద్కర్‌కు కనీసం పూలమాల వేయలేదని, ఇప్పుడు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుచేసి కాళ్లు పట్టుకో వడం దళితుల ఓట్ల కోసమేనని విమర్శించారు. ఇతరులపై అవినీతి ఆరోపణలు వస్తే భర్తరఫ్ చేసిన ముఖ్యమంత్రి తన కొడుకు, కుమార్తెలపై అవినీతి ఆరోపణలు వచ్చినా ఎందుకు భర్తరఫ్ చేయడం లేదని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేశారని గుర్తుచేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీనిచ్చారు. రూ.500కే సిలిండర్ అందజేస్తామని, ఆరోగ్యశ్రీలో రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ దత్తత తీసుకుంటుం దన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను తాము అధికారంలోకి రాగానే పరిష్కరించేందుకు శాయశక్తులా కృషిచేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, బోసురాజు, కొప్పుల రాజు, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, పోదెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు దామోదర రాజనర్సింహ, మధుయాష్కిగౌడ్, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌అలీ, మహేష్‌కుమార్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు.