Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోట నీలిమ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ధరణిపోర్టల్ అమల్లో నెలకొన్న లోపాల కారణంగా రైతులకు అది డిజిటల్ విపత్తుగా మారిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోట నీలిమ విమర్శించారు. గ్లోబల్ ఐటీ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతిన్నదని విమర్శించారు. లోపభూయిష్టమైన ల్యాండ్ రికార్డు డిజిటలైజేషన్ పోర్టల్ కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం వేలాది మంది పిటిషనర్లు ఎదురు చూస్తున్నారని తెలిపారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ధరణి అదాలత్‌లు నిర్వహించడంతోపాటు ధరణి పోర్టల్‌పై ఫిర్యాదులను నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌తో రైతులకు ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.