Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యక్షులు మల్లు రవి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వం సబ్‌ప్లాన్ నిధులను ఈమేరకు ఖర్చు చేసిందో చెప్పాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి డిమాండ్ చేశారు. ఆ నిధులను ఎంతవరకు క్యారీపార్వర్డ్ చేస్తారో ప్రజలకు వివరించాలని కోరారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు తాము వ్యతిరేకం కాదనీ, ఆయన రాసిన రాజ్యాంగాన్ని తిరగ రాస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటు యూనివర్సిటీలకు అనుమతులివ్వడం ద్వారా దళితులకు అందులో చదివే అవకాశం లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయగానే...సీఎం కేసీఆర్ మంచివాడు అయిపోయారా? అంటూ ప్రకాశ్ అంబేద్కర్‌ను ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎస్సై లోకేష్‌పై చర్యలు తీసుకోవాలి
ఉపాధ్యక్షులు జి నిరంజన్
సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెం ఎంపీటీసీ ఎర్నేని శ్రీనివాసరెడ్డిపై స్థానిక ఎస్సై లోకేష్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారనీ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి. నిరంజన్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్య తీసుకోవాలని డీజీపీని కోరారు. ఎమ్మెల్యే కనుసన్నులలోనే ఇలాంటి దాడులు కొనసాగుతున్నారని విమర్శించారు.
కర్ణాటక ఎన్నికలకు తెలంగాణ పరిశీలకులు
ఏఐసీసీ ప్రకటన
త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడి అసెంబ్లీ నియోజక వర్గాలకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొంత మంది నేతలను ఏఐసీసీ పరిశీలకులుగా నియమించింది.
ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, ఆదివాసీ జాతీయ ఉపాధ్యక్షులు బెల్లయ్యనాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఓబేదుల్లా కొత్వాల్‌లకు పరిశీలకులుగా అవకాశం కల్పించారు. గతంలో ఎన్నికల సందర్భంగా మండ్య లోక్‌సభ నియోజక వర్గానికి కుసుమకుమార్‌ను, హావేరి లోక్‌సభ స్థానానికి పొన్నం ప్రభాకర్‌ను, కోలార్ లోక్‌సభ నియోజకవర్గానికి ఉపాధ్యక్షులు హర్కర వేణుగోపాల్‌ను పరిశీలకులుగా ఏఐసీసీ నియమించిన విషయం తెలిసిందే.