Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
- పేట్లబూర్జులో క్రీచ్కు శంకుస్థాపన
- అత్యాధునిక సదుపాయాల కల్పన
నవతెలంగాణ-సిటీబ్యూరో
పోలీస్ ఉద్యోగం అంటేనే రిస్క్‌తో కూడుకున్నది. బందోబస్తులు, శాంతి భద్రతలో భాగంగా ఎప్పుడు ఎక్కడుం టారో, రాత్రి, పగలనకా ఎక్కడ విధు లు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి. ఇక మహిళా పోలీసులకు చిన్న పిల్ల లుంటే వారి సమస్యలు వర్ణనాతీతం. అటు ఉద్యోగం, ఇటు చిన్నపిల్లల సంరక్షణ ఇబ్బందికరంగా మారు తుంది. ఈ క్రమంలో పోలీస్‌శాఖలో పనిచేస్తున్న చిన్న పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగుల కోసం హైదరా బాద్ సీపీ సీవీ ఆనంద్ సరికొత్త ఆలోచన చేశారు. రోజుల చిన్నపిల్లల నుంచి ఐదేండ్ల పిల్లల సంరక్షణ చూసేందుకు వీలుగా పేట్లబూర్జులోని పోలీస్ కార్ హెడ్‌క్వార్టర్స్‌లో అధునా తన హంగులతో క్రీచ్(శిశువులను జాగ్రత్తగా చూసే స్థలం)కు శనివారం శంకుస్థాపన చేశారు. మెగా ఇంజినీ రింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ ఆర్థిక సహాయం తో రూ.4.5కోట్లతో ఈ క్రీచ్ను నిర్మి స్తోంది. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. నగర కమిష నరేట్లో 18432 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, అందులో 600మంది మహిళా పోలీస్ అధికారులు ఉన్నారని తెలిపారు. ప్రతి రోజూ ఎన్నో సవాళ్లతో మహిళ ఒత్తిడికి గురవుతుందన్నారు. మహిళా ఉద్యోగులకు ఉపశమనం కల్పించేందుకు పోలీస్ శాఖలో మెరు గైన సౌకర్యాలకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ క్రీచ్ మహిళా ఉద్యోగు లకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఈ క్రీచ్లో తాగునీటి సదుపాయం, వంట సామగ్రి, టాయిలెట్, ఆట వస్తువులు, వైద్య సదుపాయంతోపాటు పిల్లలు నిద్రపోయేందుకు ఏర్పాట్లు చేస్తున్నా మన్నారు. స్మార్ట్ టీవీ, ఇండోర్, అవుట్డోర్ ఆట వస్తువులు, విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లతోపాటు బాలింతలు పాలివ్వడానికి ఫీడింగ్ సెంటర్‌ను అత్యాధునికి సదుపాయల తో నిర్మిస్తున్నట్టు తెలిపారు. చిన్నారుల భద్రతలో భాగంగా ప్రత్యేకంగా సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నామ న్నారు. దాదాపు 100 మంది పిల్లలను సంరక్షించే కేంద్రంగా తీర్చిదిద్దుతు న్నామని, వచ్చే నవంబర్ 14వరకు పూర్తవుతుందని చెప్పారు. చిన్నారుల సంరక్షణ విషయంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ట్రైయిండ్ స్టాఫ్‌ను నియమిస్తామని సీపీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు సీపీ ఏ.ఆర్.శ్రీనివాస్, జాయింట్ సీపీ ఎం.శ్రీనివాసులు, డీసీపీలు శిరిషా రాఘవేంద్రా, సాయి చైతన్యతోపాటు ఎంఈఐఎల్ డైరెక్టర్లు పామిరెడ్డి రామా రెడ్డి, రవి రెడ్డి పాల్గొన్నారు.