Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ చీఫ్ రేవంత్ ట్వీట్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నిజామాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వసతులు లేక రోగిని ఈడ్చుకువెళ్లడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ కాదా? అని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి అని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. సర్కారు అరాచక పాలనకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ఇదేనా కేసీఆర్ చెబుతోన్న తెలంగాణ మోడల్? ఇదేనా దేశానికి ఆదర్శమైన మోడల్? అని నిలదీశారు.