Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో భారత రాజ్యంగా నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ దేశ వ్యాప్తంగా ప్రశంసల పరంపర కొనసాగుతున్నదని ఎస్సీ అభివృద్ది శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్‌లో ఆ విగ్రహం పేరు నమోదైందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను సీఎం కేసీఆర్ పేరు మీద మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు. విగ్రహ నిర్మాణం దేశ, విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు ప్రసార మాధ్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు చెబుతున్నారని వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రపంచ స్థాయిలోనే అంబేద్కర్ విగ్రహం టూరిజం కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు.