Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండికి మంత్రి కొప్పుల హితవు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హితవు పలికారు. దేశంలోనే అత్యంత ఎత్తులో 125 అడుగుల భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవిష్కరించుకున్న సందర్భంగా బండి సంజరు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. ఆయనకు మతి భ్రమించి మాట్లాడుతున్నారనీ, ప్రతిష్టాత్మక విగ్రహావిష్కరణను చూసి జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారనీ, వీటిని మానుకోవాలని హెచ్చరించారు. పేపర్ లికేజీ ఘటనలో పట్టపగలు పట్టు బడిన దొంగ బండి సంజయ్ అని ఎద్దేవా చేశారు.
దళిత జనోద్ధారణ కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత ఆయనకు లేదన్నారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు విమర్శలు చేస్తున్నారా?లేక నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నందుకు విమర్శిస్తున్నారా? అని ప్రశ్నించారు. దీనికి సీఎం కేసీఆర్పై చేసిన విమర్శలకు బండి సంజరు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నోరు అదుపులో పెట్టుకోక పోతే ప్రజలే తగిన రీతిలో సమాధానం చెబుతారని కొప్పుల ఈ సందర్బంగా హెచ్చరించారు.