Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాయిదా పడిన పరీక్షలకు కొత్త తేదీ ఖరారు : టీఎస్పీఎస్సీ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వాయిదా పడ్డ పలు పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కొత్త తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మే 16న అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏవో) పోస్టులకు రాతపరీక్షలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మే 19న డ్రగ్స్ ఇన్స్పెక్టర్, జూన్ 28న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ), జులై 18, 19 తేదీల్లో భూగర్భ జలశాఖలో గెజిటెడ్ పోస్టులకు, జులై 20న భూగర్భ జలశాఖలో నాన్ గెజిటెడ్ పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించనున్నట్టు వివరించారు. పూర్తి వివరాలకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో ఆయా పోస్టులకు ప్రకటించిన రాతపరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమినరీతోపాటు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ), అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరీక్షలను రద్దు చేసింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ ఐదు నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది.