Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.250కోట్లతో లీచెట్ శుద్ధి నిర్వహణ ప్లాంట్ ప్రారంభం
- మాట ఇచ్చా.. పట్టాలు అందజేస్తున్నా
- 3619 పట్టాలు పంపిణీ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్
- కార్పొరేషన్ అభివృద్ధికి మరో 30కోట్లు మంజూరు
నవతెలంగాణ-జవహర్ నగర్
''దేశంలోనే హైదరాబాద్ నగరం ఆదర్శం కానుంది.. ఆరు నెలల కిందట జవహర్‌నగర్‌కు వచ్చా.. పట్టాలు అందజేస్తానని మాటా ఇచ్చా.. ఇప్పు డు ఆ మాటను నిలబెట్టుకుంటున్నందుకు సంతో షంగా ఉంది.. ఇకపై జవహర్‌నగర్ చెత్త దుర్గంధం నుంచి విముక్తి కలగనుంది'' అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ కార్పొరేషన్ లోని డంపింగ్ యార్డ్‌లో రూ.250కోట్లతో ఏర్పాటు చేసిన 2000 కేఎల్డీ సామర్థ్యం గల కాలుష్యకారక వ్యర్థాల (లీచెట్) శుద్ధీకరణ ప్లాంట్‌ను మంత్రి మల్లా రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కాప్రా తహసీల్దార్ అనిత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జీవో 58 కింద పేదలకు కేటీఆర్ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జవహర్‌నగర్ డంప్ యార్డ్ నుంచి ఉత్పత్తి అయ్యే లీచెట్ కారణంగా మల్కారం చెరువు కలుషితం అవుతోందన్నారు. ఆ చెరువుతో పాటు డంప్ యార్డు చుట్టుపక్కల చెరువుల్లో ఉన్న లీచెట్ శుద్ధీకరణ ప్రక్రియను ఏడాదిలోపు పూర్తి చేయాలని అధికారుల ను ఆదేశించారు. ఈ మేరకు మల్కారం చెరువు శుద్ధిని సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని మంత్రికి రాంకీ సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మొదలు పెట్టి నప్పుడు హైదరాబాద్ నుంచి 3వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుందని లెక్క వేసిండ్రని, అందుకను గుణం గానే ఈ ప్లాంట్‌ను డిజైన్ చేశారని చెప్పారు. కానీ ఇప్పుడు 8వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుందని, ఇంకో వెయ్యి టన్నులు అయితే మూడు రెట్ల చెత్త అవుతుందని అన్నారు. అందుకే ఈ ఆలోచన చేసినమని చెప్పారు. ఇక్కడ తడి చెత్త నుంచి ఎరువు ఉత్పత్తి చేసి.. రైతులకు అమ్ముతున్నామని చెప్పారు. పొడి చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. రూ.550 కోట్లతో దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి యూనిట్‌ను గతంలోనే ప్రారంభించా మన్నారు. 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోం దని, ఇప్పుడు దానికి రెండో దశ కొన సాగుతోందని అన్నారు. మరో రూ.550 కోట్లతో 28 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణం జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్ నుంచి వచ్చే మొత్తం చెత్తతో 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడమే తమ లక్ష్యం అన్నారు. చెత్త నుంచి కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ తయారు చేసే రెండు ప్లాంట్లు పెట్టామన్నారు. బ్రిక్స్, సిమెంట్, ఫుట్‌పాత్ మీద వేసే టైల్స్ తయారు చేస్తున్నామన్నారు. జవహర్‌నగర్‌లో 8 వేల టన్నుల చెత్త వేయడం సాధ్యం కానందున దుండిగల్ దగ్గర 1500 టన్నుల చెత్తను అక్కడికి తరలించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. మరో 1500 టన్నుల చెత్తను ఇంకో ప్లేస్‌కు తరలి స్తామన్నారు. దీంతో జవహర్ నగర్లో లోడ్ తగ్గుతుం దని, దీంతో ఈ ప్రాంలో జనాలకు ఇబ్బందులు తప్పుతాయని అన్నారు.
కార్పొరేషన్లో 3619 పట్టాలు వంపిణీ
మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీలో జీవో 58, 59లను 2020 వరకు పెంచాలని కోరడంతో సీఎం కేసీఆర్ వెంటనే జీవో జారీ చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో ఇప్పటికే లక్ష పట్టాలు అందజేశామన్నారు. కార్పొరేషన్‌లోని పేద ప్రజలు జీవో 58, 59కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మేయర్ మేకల కావ్య కొన్ని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు, ఇండ్లు నిర్మించుకున్న పేదలు జీవో 58 కింద దరఖాస్తు చేసుకోగా.. 3619 వట్టాలు మంజురయ్యాయి.
జవహర్‌నగర్ నా గుండె : మంత్రి మల్లారెడ్డి
పేద ప్రజలు నివసించే జవహర్‌నగర్ తన గుండె, శ్వాస అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కార్పొ రేషన్‌లో రూ.120కోట్లతో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా ఉచితంగా నల్లా కనెక్షన్ ఇచ్చామని చెప్పారు. రోడ్లు, డ్రయినేజీ, విద్యుత్ స్థంభాలు ఏర్పాటు చేశామని తెలిపారు. జవహర్‌నగర్‌ను మోడల్ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
మంత్రి కేటీ ఆర్ జవహర్‌నగర్‌పై ప్రత్యేక నజర్ పెట్టి అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అమో రు కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ విజయ లక్ష్మి, రాజ్యసభ నభ్యుడు అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, అదనవు కలెక్టర్ నర్సింహా రెడ్డి, ఆర్డీవో రవి, జెడ్పీ చైర్మెన్ శరత్‌చంద్రారెడ్డి, జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ ఆర్ఎస్.శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్ భ్యులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.