Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
- ఐక్యతా, సామాజిక స్పృహతో ఉద్యమాలు నిర్వహించాలి
- తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఐదో మహాసభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని మోడీ సర్కారు విధానాలు..పెన్షనర్లకు వ్యతిరేకంగా ఉన్నాయని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శించారు. ఐక్యతా, పోరాటం, సామాజిక స్పృహతో పోరాటాలు నిర్వహిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన చెప్పారు. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఐదో మహాసభలు అసోసియేషన్ అధ్యక్షులు పి కృష్ణమూర్తి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు నర్సిరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఆర్థిక విధానాల్లో తీవ్ర మార్పులొచ్చాయని గుర్తుచేశారు. నూతన ఆర్థిక విధానాల అమలుకు ముందు ఎంతో కొంత కనీస రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా పాలనా విధానాలు ఉండేవని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రయివేటు పరం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యత తో కాకుండా పెన్షనర్ల విషయాన్ని ఆదాయ వనరుగా చూడటం బాధాకరమన్నారు.పేదలపై పరోక్ష పన్నులేసి, కుబేరులకు మాత్రం పన్నుల్లో రాయితీలు కల్పిస్తున్నదని విమర్శించారు. మన సమస్యలు రాజకీయాలకు ముడిపడి ఉన్నాయన్నారు. దేశాన్ని పాలిస్తున్న పాలకుల గురించి మాట్లాడాల్సి వస్తే..ఎవరెక్కువ ప్రమాదం? ఎవరు తక్కువ ప్రమాదమనే కోణంలో ఆలోచించాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. దేశంలో మెజార్టీ ప్రజలకు పొట్ట నిండా తిండి లేకున్నా.. మతాలు, వాటి ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్న పాలనలో మనమున్నామని చెప్పారు. ఈహెచ్ఎస్ కార్డు అనేది పేరుకే ఉందని తెలిపారు. రియింబర్స్మెంట్ కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వస్తున్నదన్నారు మంచి సమాజం కోసం పోరాడితేనే పెన్షనర్ల బతుకు భద్రంగా ఉంటుందని తెలిపారు. ఆలిండియా కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అతుల్ డిగ్గే మాట్లాడుతూ పెన్షన్లు పెంచని ప్రభుత్వాన్ని ఓడించేందుకు నిరంతర పోరాటాలు చేయాల్సిన అవసరముందన్నారు. ప్రజలకు, పెన్షనర్లకు, రైతులకు, కార్మికులకు తీవ్ర నష్టం కలిగించే విధానాలకు మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నదని చెప్పారు. అదానీ, అంబానీలకు మేలు చేసే నిర్ణయాలను చేస్తున్నదని విమర్శించారు. రైతులకు నష్టం చేసే నల్ల చట్టాలను మోడీ ప్రభుత్వం తీసుకొస్తే..దానికి వ్యతిరేకంగా ఎలాంటి పోరాటాలైతే జరిగాయో..వాటి స్ఫూర్తితో ఉద్యమాలు చేయాల్సిన అవసరముందని సూచించారు. ఈపీఎఫ్ నిధులను షేర్ మార్కెట్లో పెట్టటమేంటని ప్రశ్నిం చారు. అధికారంలోకి వచ్చేముందు పెన్షనర్లకు మంచి రోజులున్నాయని మోడీ నమ్మబలికారని గుర్తుచేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ పెన్షనర్లు తమకు శక్తి ఉన్నన్నాళ్లు ఏదో ఒక రూపంలో సమాజానికి సేవచేశారని చెప్పారు. ఉద్యోగ విరమణ తర్వా త వారిని ఎవరు చూసుకోవాలని ప్రశ్నించారు. ప్రభుత్వా నికి సామాజిక బాధ్యత ఉండాలన్నారు. అనేక దేశాల్లో రిటైర్డ్ ఉద్యోగుల బాధ్యతను ప్రభుత్వాలే చూసుకుంటు న్నాయని తెలిపారు. పెన్షనర్ల సాధారణ కోర్కెలను కూడా నెరవేర్చకుండా సర్కార్ నిర్లక్ష్యం చేయటం తగదన్నారు. అసలు సమస్యలు సృష్టిస్తున్నదే ప్రభుత్వమని వివరిం చారు. వాజ్పారు కాలంలోనే పెన్షన్ రద్దు బిల్లును తయా రు చేశారని తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై బిల్లును ప్రవేశ పెట్టారని తెలిపారు. సీపీఐ(ఎం) ఎంపీలు దీన్ని అడ్డుకున్నారని వివరించారు. పీఎఫ్ కాజేసే బిల్లు 1995లోనే వచ్చిందన్నారు. దీనికి వ్యతిరేకంగా సీఐటీయూ మాత్రమే సమ్మె చేసిందని గుర్తు చేశారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షనర్లకు రైళ్లల్లో ఉన్న కనీస సౌకర్యాలు కూడా కత్తిరించారని చెప్పా రు.పెన్షనర్లు హిందువులు కాకుండా పోయారా?అని ప్రశ్ని ంచారు. ధరలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగు తోంది, విద్య, వైద్యం ఖరీదైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా బతకాలని ప్రశ్నించారు. ఏఐసీసీఈపీఎస్పీఏ చైర్మెన్ ఎంఎన్ రెడ్డి, టీఏపీఆర్పీఏ ప్రధాన కార్యదర్శి మచ్చా రంగయ్య, స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ జేఏసీ చైర్మెన్ కె లక్ష్మయ్య, ఎస్టీఎఫ్ఐ ఉపాధ్యక్షులు చావ రవి, తదితరులు ప్రసంగించారు.