Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్కు లేదని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వందరోజుల్లో నిజాం షుగర్ ఫాక్టరీ తెరిపిస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ పేరుతో గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మూతబడ్డ అన్నీ ఫాక్టరీలు తెరుస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదో చెప్పాలని ప్రశ్నించారు.