Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ బి.భాస్కర్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అవయవాల రవాణా కోసం ఏర్పాటు చేస్తున్నట్టుగానే అంబులెన్సుల కోసం గ్రీన్ కారిడార్లను రూపొందించాలని కన్సార్టియం ఆఫ్ అక్రెడిటెడ్ హెల్త్‌కేర్ ఆర్గనైజేషన్స్ కాన్ఫరెన్స్ -2023 చైర్మెన్ డాక్టర్ బి.భాస్కర్ రావు సూచించారు. ఆదివారం హైదరాబాద్ కాన్ఫరెన్స్ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అత్యధికంగా హైదరాబాద్‌లో ఒక ఏడాదిలో 100కు పైగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని తెలిపారు. ఇవే కాకుండా కాలేయం, కిడ్నీ, ఎముక మజ్జ మార్పిడి చికిత్సలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రంలో కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ విజరు అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. తదుపరి 2024లో సదస్సు కోల్‌కతాలో జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు.