Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ అరవింద్‌కు బ్రౌన్ హైవే విస్తరణ బాధితులు వినతి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న బ్రౌన్ హైవే విస్తరణతో ఇండ్లు, భవనాలు, వ్యాపారాలు, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు కోల్పోతున్నామని పలువురు బాధితులు వాపోయారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన పలువురు బాధితులు బీజేపీ నాయకులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డితో కలిసి ఎంపీ అరవింద్‌ను ఆదివారం ఆయన నివాసంలోకలిసి వినతిపత్రం అందజేశారు. బ్రౌన్ హైవే కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని, కాబట్టి సంబంధిత కేంద్ర మంత్రితో మాట్లాడి తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎంపీ అరవింద్ తప్పకుండా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పినట్టు బాధితులు తెలిపారు. ఎంపీని కలిసిన వారిలో రేంజర్ల గంగారం, గుండోజి దేవేందర్, చింత ప్రవీణ్, చింత తిరుపతి, హౌటల్ రఘు, టీవీఎస్ ధరి, రమణయ్య, చంద్రశేఖర్, రమేష్, తదితరులు ఉన్నారు.