Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలేవి?
- నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కులేదు
- పేపర్ లీకువీరుల మార్చ్ హస్యాస్పదం: ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యంవినయ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
'వరంగల్‌లో బీజేపీ రాజకీయ నిరుద్యోగుల మార్చ్ జరిగింది. అది అబద్దాల మార్చ్. ఆ పార్టీకి నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదు. తెలంగాణలో కాదు ఢిల్లీలో చేయాలి. మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. వాటిపై మోడీని నిలదీయాలి. పేపర్ లీకు వీరులు నిరుద్యోగ మార్చ్ చేయడం హాస్యాస్పదం అందులో నిరుద్యోగులు లేరు.. అడ్డమీద కూలీలే ఉన్నారు' అని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మెన్ కె.వాసుదేవరెడ్డితో కలిసి బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగులు ప్రభుత్వం కల్పించిన వసతులతో పరీక్షలకు సిద్ధమవుతున్నారని, రోడ్ల మీదకు ఎవ్వరూ నిరుద్యోగులు రారని అన్నారు. పదో తరగతి పేపర్ల లీకేజీ కుట్రదారు అని వాట్సాప్ చాట్లతో రుజువైందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ది గాంధీ సిద్ధాంతం, బీజేపీది గాడ్సే సిద్దాంతమని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీజేపీ చిచ్చు పెట్టాలనుకుంటోందని విమర్శించారు. విభజన చట్టం అమలుకు ఢిల్లీలో బీజేపీ ధర్నా చేస్తే తామూ మద్దతు ఇస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం దగ్గరకు బీజేపీ నేతలు వస్తే అభివద్ధిపై చర్చిద్దామని సవాల్ విసిరారు. మతం, కులం ఆధారంగా బీజేపీ ప్రజలను విడగొడుతున్నదని, ఆ కుట్రలను బీఆర్ఎస్ తిప్పి కొడుతుందని చెప్పారు. వాసుదేవరెడ్డి మాట్లాడుతూ బీజేపీకి దమ్ముంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగాల భర్తీపై తమ పార్టీ ఇప్పటికే శ్వేత పత్రం ప్రకటించిందని గుర్తుచేశారు.