Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముదిరాజ్ మహాసభ మహిళా విభాగం సమావేశంలో బండాప్రకాష్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మహిళలు ఆర్థిక, రాజకీయ, సామాజికంగా అభివృద్ధి చెందినప్పుడే నిజమైన మహిళా సాధికారత, అందుకోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ బండాప్రకాష్ పిలుపునిచ్చారు. ఆదివారం ఖైరతాబాద్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో ఆదివారం జరిగిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు. ముదిరాజ్ మహిళల సాధికారత కోసం పనిచేయాలని కోరారు. ముదిరాజులే మత్స్య కారులు.. మత్స్యకారులే ముదిరాజులు అని వ్యాఖ్యా నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివద్ధిలోమనం ఎట్లా అభివృద్ది కావాలో ఆలోచిం చాలని సూచించారు. ముదిరాజ్ మహాసభలో మహిళా విభాగంతో పాటు యువజన విభాగం, డాక్టర్స్, లాయర్స్, ఐటి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, వివిధ రకాల విభాగాలతో సంఘాన్ని బలోపేతం చేయడానికి కషి చేయాలని కోరారు.
మిగతా వతుల వారితో కలిసి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు మందుల వరలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతలపావని, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉష, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కె.రాధిక, ప్రధాన కార్యదర్శి మర్రికట్టెల శారద, రాష్ట్ర కార్యదర్శులు ఉష, అనురాధ, దీపిక, యాదాద్రి జిల్లా అధ్యక్షులు ఝాన్సీ, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బండిశ్రావణి, నల్గొండ జిల్లా అధ్యక్షులు కోట్ల సునీత పాల్గొన్నారు.