Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేల మంది మహిళలకు వైద్య పరీక్షలు
- సమాచార, పౌర సంబంధాలశాఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నది. అన్ని రకాల జబ్బులను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా ప్రజల ఆరోగ్యం కాపాడటంతో పాటు వారిపై ఆర్థిక భారం పడకుండా ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. కంటి వెలుగు రెండో దశ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,08,99,470 మందికి కంటి పరీక్షలు చేసి వారిలో 17,20,200 మందికి ఉచితంగా రీడింగ్ గ్లాసెస్‌ను, అవసరమైన ఔషధాలను అందజేశారు. 13,11,858 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఇవ్వాలని పరీక్షల ద్వారా గుర్తించారు. 78,67,170 మందికి కంటి సమస్యలు లేవని నిర్దారించారు. జనవరి 19న ప్రారంభమైన ఈ కార్యక్రమం జూన్ 15 వరకు 100 పనిదినాల్లో కొనసాగనున్నది. రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు నిరంతర పర్యవేక్షణ, ప్రణాళిక ద్వారా విజయవంతంగా నిర్వహిస్తూ ప్రజల మన్ననలను అందుకుంటున్నది. 40 ఏండ్లు పైబడిన వారిలో ఎక్కువగా దగ్గర చూపు కనిపించడం లేదని వైద్యులు , 50 ఏండ్లు పైబడిన వారికి ఎక్కువగా కాటరాక్ట్ సమస్య ఉన్నట్టు బయటపడుతున్నాయి. ''అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభమై ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 కేంద్రాల్లో దీని ద్వారా మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న వ్యాధులను గుర్తించేందుకు ఇప్పటి వరకు 10 వేల మందికి ఎనిమిది రకాల పరీక్షలను చేశారు. అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి వారిని చికిత్స కోసం ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు.... '' అని సమాచార, పౌర సంబంధాలశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.