Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ సమక్షంలో చేరిన మహారాష్ట్ర నేతలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
బీఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికల జోరు కొనసాగుతున్నది. నాందేడ్, కాందార్లోహ వంటి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి మొదలైన ఈ చేరికల పర్వం, మధ్య మహారాష్ట్రకు చేరుకున్నది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు ఆదివారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే అన్నా సాహెబ్మానె, సంతోష్ మానె, ప్రశాంత్ పాటిల్, గంగాపూర్ నియోజక వర్గానికి చెందిన సంతోష్ కుమార్, ఔరంగాబాద్ ఎన్సీపీ యూత్ అధ్యక్షులు ప్రశాంత్ పాటిల్, సంతోష్ కుమార్కు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, విప్ బాల్కసుమన్ తదితరులు పాల్గొన్నారు.