Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కరీంనగర్ రూరల్
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి గ్రామానికి వెళ్లిన మంత్రి గుంగుల కమలాకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కరీంనగర్ రూరల్ మండలం చర్ల బూత్కూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం గ్రామంలో చిరుతల రామాయణం నిర్వహిస్తున్నారన్న విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లి గ్రామస్తులను కలుసుకోవాలని భావించారు. చిరుతల రామాయణం జరుగుతున్న వేదికపైకి మంత్రి చేరుకోగానే ఆయన వెంట ద్వితీయ శ్రేణి నాయకులు పెద్ద ఎత్తున స్టేజీ పైకి ఎక్కారు. ఓవర్ లోడ్ కారణంగా డయాస్ కిందకి జారడంతో మంత్రి గంగుల కమలాకర్ కాలికి స్వల్ప గాయం కాగా వెంటనే కరీంనగర్‌లోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకువచ్చి పరీక్షలు నిర్వహించారు. కాలికి ఫ్యాక్చర్ ఏమి కాలేదని నిర్ధారించిన వైద్యులు క్రేప్ బ్యాండేజ్ వేసి రెస్ట్ తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. మంత్రి గంగుల కమలాకర్ కాలికి గాయాలైన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు.. మంత్రి ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.