Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
ఈనెల 24, 25వ తేదీల్లో యాదగిరిగుట్టలో ఐద్వా రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామని, సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లులక్ష్మీ పిలుపునిచ్చారు. ఆదివారం యాదాద్రిభువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకొచ్చాక మహిళల హక్కులపై దాడి జరుగుతున్న పరిస్థితి ఉందన్నారు. లైంగికదాడులు కూడా బాగా పెరిగి పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల పట్ల చిన్నచూపు చూసే సంస్కృతి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల సమస్యలపై రెండురోజుల పాటు జరిగే సమావేశంలో చర్చించి పోరాట కార్యక్రమాలు రూపొందిస్తామని తెలిపారు. సమావేశాలకు ఐద్వా జాతీయ సహాయ కార్యదర్శి సుధా సుందరరామన్, జాతీయ కోశాధికారి ఎస్.పుణ్యవతితో పాటు ఇతర నాయకులు హాజరవుతారన్నారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టిపల్లి అనురాధ, తదితరులు పాల్గొన్నారు.