Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలుగు ప్రజల కోసం సేవ, సంస్కతి, సమానత్వం అందిస్తూ మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ, యువతను ప్రోత్సహిస్తూ వయోదిక పౌరులకు ఉత్తమమైన సంరక్షణను అందించడం లక్ష్యంగా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్(మాటా) పేరిట ఒక కొత్త తెలుగు సంఘం ఏర్పడింది. ఏప్రిల్ 14 శుక్రవారం న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ పాలస్‌లో జరిగిన ఈ గ్రాండ్లాంచ్ ఈవెంట్లో దాదాపు 2500 మంది తెలుగు ప్రజలు పాల్గొన్నారు. డా.వడ్డేపల్లి కష్ణ రచించిన 'మాటా' స్వాగత గీతానికి పార్థసారథి సంగీతం అందించారు. ప్రముఖ నత్యదర్శకులు స్వాతి అట్లూరి తన 70 మంది శిష్యబందంతో ప్రదర్శించిన నత్యం సభికుల్ని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మాటా వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్సామల మాట్లాడుతూ సేవా, సంస్కతి, సమానత్వం అనే 3 ప్రధాన సూత్రాల ఆధారంగా ఈ సంస్థను స్థాపించడం జరిగిందని వివరించారు. లక్ష్మీ మోపర్తి ఆధ్వర్యంలో యూత్టీమ్ మిషన్, విజన్‌ను ప్రదర్శించారు. ప్రముఖ నేపథ్య గాయని సునీత, గాయకుడు అనిరుధ్ తమ మరపురాని సంగీత కచేరితో సభికులను అలరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ అసోసియేషన్ సభ్యులు హదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.