Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభల సావనీర్‌ను ఆ సంఘం అధ్యక్షప్రధానకార్యదర్శులు చుక్కరాములు, పాలడుగుభాస్కర్, కోశాధికారి వంగూరు రాములు చేతుల మీదుగా ఆదివారం సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. 2022 డిసెంబర్ 21,22,23 తేదీల్లో సిద్ధిపేటలో దిగ్విజయంగా జరిగిన నాలుగో రాష్ట్ర మహాసభల విశేషాలు సావనీర్లో ఉన్నాయి. ఆహ్వాన సంఘం చైర్మెన్ చుక్క రాములు స్వాగతోపన్యాసం, దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ విధానాలపై సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ విలువైన సమచారంతో కూడిన వ్యాసం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగుభాస్కర్, పూర్వ ప్రధాన కార్యదర్శి ఆర్.సుధాభాస్కర్ రాసిన వ్యాసాలతోపాటు ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి కె.గోపాలస్వామి కతజ్ఞతల వ్యాసం, అభినందనలతో కూడిన ప్రకటనలతో ఈ సావనీర్ ఆకర్షనీయంగా వెలువడింది. 700 మంది ఎంపిక చేసిన ప్రనినిధులతో మూడ్రోజుల పాటు జరిగిన మహా సభలు, ముగింపు రోజు వేలాది మందితో జరిగిన బహిరంగ సభల నిర్వహణ ఎంతో వ్యయ, ప్రయా సాలతో కూడుకున్నదనీ, దీని జయప్రదానికి తోడ్ప డిన దాతలు, శ్రేయోభిలాషులు, వ్యాపార, వాణిజ్య, ప్రముఖులు, వేలాది కార్మికులు ప్రతి ఒక్కరికీ పాలడుగుభాస్కర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కార్మిక వర్గ హక్కుల సాధనకు ఈ మహా సభలు స్ఫూర్తివంతంగా నిలిచాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఎస్.వీరయ్య, జె.వెంకటేష్, ఎస్.రమ, పి.జయలక్ష్మీ, వీఎస్‌రావు, కళ్యాణం వెంకటేశ్వర్లు, టి.వీరారెడ్డి, జె.మల్లికార్జున్, జె.చంద్రశేఖర్, బి.మల్లేష్, బి.మధు, ఎ.ముత్యంరావు, ఎం.వెంకటేశ్, రాగులరమేష్, ఎజె.రమేష్, పి.శ్రీకాంత్, కూరపాటి రమేష్, కె.ఈశ్వర్రావు, కె.గోపాలస్వామి తదితరులున్నారు.