Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బేగంపేటలోని పైగా ప్యాలెస్‌ను రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా స్వాధీనం చేసుకున్నది. హైదరాబాద్ బేగంపేటలోని చిరాన్ పోర్ట్లేన్లోని పైగా ప్యాలెస్‌లో గతంలో యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఉండేది. ప్రస్తుతం కాన్సులేట్ జనరల్ అక్కడ్నుంచి తరలి వెళ్లడంతో ప్రభుత్వం దీన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, యూఎస్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.