Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టానని తెలంగాణ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని నాచారంలో ఉన్న తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో మహిళ శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళికేరి, ఉద్యోగులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ సంతోష్ కుమార్ చేపట్టిన మహోద్యమంలో భాగంగా తమ వంతుగా మొక్కలు నాటి మద్దతు తెలియజేస్తున్నాయని వివరించారు. ఆయన తలపెట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ గొప్ప ఉద్యమంలా దేశవ్యాప్తంగా సాగుతున్నదని చెప్పారు. వృక్షో రక్షతి రక్షిత: అని పెద్దలన్నారని, ఇప్పుడు మనం చెట్లను రక్షిస్తేనే రానున్న రోజుల్లో అవి మనల్ని రక్షిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఈ చాలెంజ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.