Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో సాధ్యమైన ఈ పథకాల అమలు మహారాష్ట్రలో సాధ్యం కాదా?: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణలో సాధ్యమయ్యే పథకాలు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కావని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 450 స్కీములపై మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఔరంగాబాద్‌లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు కేవలం ఓట్లు, సీట్ల రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణకు కేసీఆర్ పాలన స్వర్ణయుగమని అభివర్ణించారు.
రైతుబంధు, ఉచిత విద్యుత్, రుణమాఫీ, ధాన్యం సేకరణ, రైతుబీమా, రైతు వేదికల నిర్మాణం, మిషన్ కాకతీయ, వ్యవసాయ యాంత్రీకరణ, రాయితీపై విత్తనాల సరఫరా, సబ్సిడీకి సూక్ష్మ సేద్యం పరికరాల పంపిణీ, గురుకుల పాఠశాలలు, కళాశాలల నిర్వహణ, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం, కిశోర బాలికలకు హెల్త్ కిట్లు, వందకు పైగా డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు తదితర వాటితో కేసీఆర్ పాలనలో మార్పు వచ్చిందని జీవన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 24న ఔరంగాబాద్‌లో జరిగే సభ ద్వారా కేసీఆర్ వీటిని నివేదించనున్నారనీ, ఈ సందర్భంగా ప్రతీ పల్లె గులాబీమయం కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపి బీబీ పాటిల్, ఐడీసీ చైర్మెన్ వేణుగోపాలాచారి, బీఆర్ఎస్ పార్టీ మహారాష్ర ్ట కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం, మాజీ ఎమ్మెల్యే శంకరన్న ఢోంగే, యువ నాయకులు అంకిత్, శివాంక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.