Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వన్యప్రాణుల సంరక్షణలోనూ భేష్
- నిటిఆయోగ్ నివేదిక అదే చెప్పింది : బోయినపల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అడవుల విస్తరణలో దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో ఉందనీ, వన్యప్రాణుల సంరక్షణలోనూ భేష్‌గా ఉందని నిటి అయోగ్ చెప్పిన విషయాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రస్తావించారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. బీజేపీ పాలిత, ఇతర రాష్ట్రాల్లోని కాంపా నిధుల వినియోగంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివేదికలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా కాలంలోనూ ( 2019-20, 2020-21, 2021-22) పెద్ద ఎత్తున కాంపా నిధులు వినియో గించుకున్న రాష్ట్రం తెలంగాణనే అని తెలిపారు. ఐఎస్ ఎఫ్ఆర్ నివేదిక ప్రకారం 2015-2021 కాలంలో తెలం గాణ రాష్ట్రంలో 7.7 శాతం అడవుల విస్తీర్ణం పెరిగిందనీ, 2019-2021 కాలంలో 3.07 శాతం అడవుల విస్తీర్ణం పెరిగిందని పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో నీటి లభ్యత పెరిగిందనీ, గిరిజనులకు, మహిళలకు ఉపాధి అవకాశా లు పెరిగాయని వివరించారు. కాంపా నిధుల విని యోగం తెలంగాణలో బాగుందని పార్లమెంట్లో కేంద్ర మంత్రులు పలుమార్లు గుర్తుచేసిన విషయాన్ని ప్రస్తావించారు.