Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిమాచల్ ప్రదేశ్‌లో ఓపీఎస్ అమలు
- సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖుకు ఎన్ఎంఓపీఎస్ కృతజ్ఞతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హిమాచల్ ప్రదేశ్‌లో ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్) పునరుద్ధరించబడింది. ఓపీఎస్‌ను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈనెల ఒకటో తేదీ నుంచి దాన్ని వర్తింపచేస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓట్ ఫర్ ఓపీఎస్ కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాత పెన్షన్ అందుకుంటున్నారని, ఈ సందర్భంగా వారికి నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్ఎంఓపీఎస్) సెక్రెటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ శుభాకాంక్షలు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖుకు కృతజ్ఞతలు ప్రకటించారు. అనంతరం స్థితప్రజ్ఞ, తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో 2003, మే 15 నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) అమలవు తున్నదని వివరించారు. దానికింద నియమితులైన ఉద్యోగ, ఉపాధ్యాయులకి 1972 సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ అమలు చేయుటకు 1,36,000 మంది ఉద్యోగ, ఉపాధ్యా యులకు పాత పెన్షన్ పునరుద్ధరిస్తూ హిమాచల్ ప్రదేశ్‌లో మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని తెలిపారు. మే ఒకటి 2023 నుంచి అక్కడ పూర్తిస్థాయిలో విధివిధానాలతో కూడిన ఓపీఎస్‌కి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిందని పేర్కొన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎన్పీఎస్ కోసం 10 శాతం నిలిపివేయబడుతుందని వివరించారు. ఓపీఎస్ అమలు కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులం దరికీ జీపీఎఫ్ ఖాతాలు ప్రారంభమవుతాయని తెలి పారు. ఇప్పటివరకు రిటైర్ అయిన వారికి కూడా ఓపిఎస్ ప్రయోజనాలు పునరుద్ధరించ బడతాయని క్యాబినెట్ ప్రకటించిందని పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాలు కూడా ఓపిఎస్ అమలు చేసి సీపీఎస్ ముఖ్త్ భారత్ కావాలని కోరారు.