Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా, పూర్తిస్థాయి నియోజక వర్గ స్థాయీ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 18 ,19 తేదీల్లో కరీంనగర్ టౌన్, ఇతర నియోజక వర్గాల్లో తమ బృందం పర్యటిస్తుందని తెలిపారు. నియోజకవర్గ, బ్లాక్ కమిటీలను వేస్తామని పేర్కొన్నారు.