Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజీవ్ గాంధీపంచాయతీ రాజ్ సంఘటన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్థానిక సంస్థల ప్రతినిధుల సమస్యలపై పోరాటం చేయాలని టీపీసీసీ రాష్ట్ర రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ నిర్ణయించింది. సోమ వారం ఇందిరాభవన్‌లో సంఘటన్ చైర్మెన్ రాచమల్ల సిద్ధేశ్వర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నా రు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ లోపభూయిష్టంగా మారిందనీ, సర్పంచ్‌లు నిధులు లేక అల్లాడిపోతున్నారనీ, చేసిన పనులకు డబ్బుల్లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఈ సందర్భంగా వారు విమర్శించారు.
మార్గమధ్యంలో రాహుల్‌తో...
కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్తూ మార్గమధ్యంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పార్టీలో దిగిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, నదీమ్ జావిద్ లు కలిశారు.
సత్యాగ్రహ దీక్షకు తరలిరండి :మల్లు రవి
మంగళవారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా, సీబీఐతో విచారణ జరిపించాలనే డిమాండ్‌తో నిర్వహిస్తున్న సత్యాగ్రహ దీక్షకు యువత తరలి రావాలని టీపీసీసీ సీనియర్ నాయకులు మల్లు రవి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి పిలుపునిచ్చారు.