Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైఎస్ఆర్టీపీ నేత గట్టు రామచందర్రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వైఎస్ఆర్టీపీపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్భందాన్ని మోపుతున్నదని ఆ పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సభ్యులు గట్టు రామచందర్రావు ఆరోపించారు. సోమవారం హైదరాబాద్లోని లోటస్ పాండ్లో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగ దీక్షలకు న్యాయస్థానం ద్వారా అనుమతి కోరతామన్నారు. వాటిని ఆపేదే లేదని తెలిపారు. అందుకోసం అఖిల పక్ష పార్టీల మద్దతు తీసుకుంటాన్నామనీ, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. దీక్షకు 39 ప్రజా సంఘాల మద్దతు తెలిపాయని వివరించారు.