Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త ఎక్సైజ్ స్టేషన్ల గెజిట్ విడుదల చేయాలి :మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో గుడుంబా, గంజాయి, డ్రగ్స్‌పై అధికారులు నిరంతరం నిఘా పెట్టాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్‌గౌడ్ అదేశించారు. రాష్ట్రా న్ని గుడుంబా, గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఎక్సైజ్ శాఖ కమి షనర్, ఉన్నతాధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ పనితీరుపై కమిషనర్ సర్ఫరాజ్అహ్మద్, ఉన్నతాధి కారులతో మంత్రి సోమవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆమో దించిన నూతన ఎక్సైజ్ స్టేషన్ల ఏర్పాటుపై తక్షణం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వ హిస్తూ ఇటీవల ఇన్స్పెక్టర్గా పదోన్నతులు పొందిన అధికారులకు తక్షణం పోస్టింగులను ఇవ్వా లని ఆదేశించారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన సబ్ ఇన్స్పెక్టర్ల సర్వీసు ను క్రమబద్దీకరించాలని అదేశించారు. నిర్మాణ దశలో ఆగిపోయిన ఎక్సైజ్ స్టేషన్ల ను త్వరితగతిన పూర్తి చేసి వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, డిప్యూటీ కమిషనర్లు డేవిడ్ రవికాంత్, దత్తరాజుగౌడ్, సహాయ కమిషనర్ చంద్రయ్య, డీపీఈఓలు సత్యనారాయణ, రవీందర్రావు, విజయభాస్కర్, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
'సమ్మర్ స్పోర్ట్స్ మీట్' ఆవిష్కరణ
పాఠశాల స్థాయిలోనే విద్యార్థులను క్రీడీల్లో ప్రోత్సహించాలని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో 7హెచ్స్పోర్ట్స్ సంస్థ వ్యవస్థాపకులు వెంకటేష్ అధ్వర్యంలో 'సమ్మర్ స్పోర్ట్స్ మీట్' వాల్ పోస్టర్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్ టోర్నమెంట్ పోస్టర్లను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమ్మర్ క్యాంప్‌లో బాడ్మింటన్, క్రికెట్, స్విమ్మింగ్, స్కేటింగ్, టేబుల్ టెన్నిస్ మొత్తం 5 క్రీడల్లో 10 ఏండ్ల వయస్సు నుంచి 17 ఏండ్ల వయస్సులోపు వారు ఎవరైనా పాల్గొనేలా చూడాలని కోరారు. ఈ టోర్నమెంట్‌ని ఏప్రిల్, మే, జూన్లలో నిర్వహించ బోతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర కోశాధికారి, ఉప్పల్ ప్రాంతీయ రవాణాధికారి పుల్లెంల రవీందర్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు.