Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర సచివాలయం ప్రారంభించనున్న ఈ నెల 30వ తేదీ లోపు తమ సమస్యలను పరిష్కరించకుంటే మరో పోరాటానికి సన్నద్ధం అవుతామని వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. సోమవారం హైదరాబాద్లో వీఆర్ఏ జేఏసీ సమావేశం చైర్మెన్ ఎమ్.రాజయ్య అధ్యక్షతన జరిగింది. అందులో కో-చైర్మెన్ రమేశ్ బహుదూర్, సెక్రటరీ జనరల్ ఎస్కే దాదేమియా, కన్వీనర్లు వంగూరు రాములు, ఎన్.గోవింద్, షేక్ మొహమ్మద్ రఫీ, వెంకటేశ్ యాదవ్, కావలి మాధవ్ నాయుడు, షేక్ అజీజ్, పి.రాజయ్య, వి.ఉమా మహేశ్వర్రావు, డి.రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మంత్రి కేటీఆర్ నాలుగుసార్లు జేఏసీతో చర్చలు జరిపి తమ పోరాటం న్యాయమైనదని చెప్పారన్నారు. తనను నమ్మి సమ్మె విరమించాలని చెప్పి ఇప్పటి వరకూ సమస్యల్ని పరిష్కరించకపోవడం దారుణమని విమర్శించారు.