Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీపీఐ(యూ) కేంద్ర కమిటీ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈనెల 24 నుంచి వచ్చేనెల ఒకటో తేదీ వరకు ప్రజా ఉద్యమ క్షేత్రంలో నేలకొరిగిన అమరుల సంస్మరణ వారోత్స వాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఎంసీపీఐ(యూ) కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పంజాబ్‌లోని చండీఘర్‌లో ఈనెల 13 నుంచి ప్రారంభమైన ఎంసీపీఐ(యూ) జాతీయ కమిటీ సమావేశాలు శనివారం ముగిశా యని తెలిపారు. మేడేను ఫాసిజానికి వ్యతిరేకంగా నిర్వహించాలని పేర్కొన్నారు. వచ్చేనెల తొమ్మిదో తేదీన వీర తెలంగాణ రైతన్న సాయుధ పోరాట యోధులు, మాజీ ఎంపీ భీంరెడ్డి నరసింహరెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించామని వివరిం చారు. మార్క్సిజం, లెనినిజం పునాదిగా భారతదేశంలో ఉన్న ఫ్యూడల్ భూస్వామ్య పెత్తందారీ మనువాద సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడాలని తెలిపారు. బుద్ధుడు, ఫూలే, పెరియార్, సాహుమహ రాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ, అల్లూరి వంటి సామాజిక సంస్కర్తలు, విప్లవవీరులందరినీ ఐకాన్లుగా గుర్తిం చాలని, వారి సమిస్టి సిద్ధాంతం ఆచరణలో కొనసాగాలని చారిత్రాత్మక చండీఘడ్ డిక్లరేషన్‌ను ప్రకటించామని వివరించారు. రానున్న కాలంలో బలమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రత్యామ్నాయం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.