Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తాము విచారణ జరుపుతున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఆయన్ను విచారణ చేయాలని రాష్ట్ర హైకోర్టు సీబీఐకి ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం జస్టిస్ సురేందర్ ఎదుట అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. మంగళవారం కూడా వాదనలు జరగనున్నాయి.