Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7 శాతం పెంపుతో 90శాతం ఉద్యోగులకు నష్టం
- భవిష్యత్ పోరాటాలకు సిద్ధంకండి : టీఎస్‌యూఈఈయూ రాష్ట్ర కమిటీ పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ ఉద్యోగులకు యాజమాన్యం ప్రకటించిన ఏడు శాతం ఫిట్మెంట్ నిర్ణయాన్ని పునఃస్సమీక్షించాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ నిర్ణయం వల్ల 90 శాతం మంది ఉద్యోగులకు నష్టం జరుగుతుందని స్పష్టంచేసింది. సోమవారం నాడిక్కడ జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే ఈశ్వరరావు, వీ గోవర్థన్, సీఐటీయూ కార్యదర్శులు భూపాల్, జే వెంకటేష్, టీఎస్ఎస్పీడీసీఎల్ అధ్యక్షులు ఎస్ చంద్రారెడ్డి, టీఎస్ఎన్పీడీసీఎల్ అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు, కే సత్యం, ఎమ్ ప్రసాద్, రాష్ట్ర నాయకులు జే బస్వరాజ్, జే ప్రసాద్‌రాజుతో పాటు ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. యాజమాన్య నిర్ణయం వల్ల సర్వీసు తక్కువగా ఉన్న ఆర్టిజన్లు, జేఎల్ఎమ్, ఏఎల్ఎమ్ ఎల్డీసీ, యూడీసీలకు నష్టం జరుగుతుందని రాష్ట్ర కమిటీ తెలిపింది.
ఉద్యోగులకు పెద్ద ఎత్తున నష్టం కలిగిస్తూ, అన్యాయానికి గురిచేస్తున్న యాజమాన్య నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని సవరించాలని కోరుతూ కలిసివచ్చే కార్మిక సంఘాలతో ఆమోదయోగ్యమైన వేతన సవరణ, ఆర్టిజన్ కన్వర్షన్, సమాన సర్వీస్‌రూల్స్, 6,500 మంది అన్మ్యాన్డ్, పీస్‌రేట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దీనికోసం అవసరమైన కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.