Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర సమాచారశాఖ మంత్రి దేవుసిన్ జెసింగ్భారు చౌహాన్
- స్పెషల్పోస్టల్ కవర్ విడుదల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 'మహిళా సమ్నాన్ సేవింగ్ సర్టిఫికెట్' కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందనికేంద్ర సమాచారశాఖ మంత్రి దేవుసిన్ జెసింగ్భారు చౌహాన్ తెలిపారు. సోమవారం రంగా రెడ్డి జిల్లాలోని నందిగామ మండలం కన్హా శాంతివనంలో పద్మభూషన్ అవార్డు గ్రహీత, రామచంద్రామిషన్ అధ్యక్షులు కమలేష్ డి పాటిల్‌తో కలిసి చౌహాన్ 'మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్' స్పెషల్ కవర్‌ను సోమ వారం విడుదల చేశారు.
కన్హా శాంతి వనం గ్రామంలోని సబ్‌పోస్టు ఆఫీసు కు చెందిన 10 మంది లబ్ధిదారులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సంద ర్భంగా చౌహాన్ మాట్లాడుతూ 'మహిళా సమ్నాన్ సేవింగ్ సర్టిఫికెట్' పథకం దేశంలోని 1,57 లక్షల పోస్టు ఆఫీసుల్లో అందుబాటులో ఉందని అన్నారు. ఈ పథకంలో రెండేండ్లలో పూర్తవుతుందని, రూ.2లక్షల వరకు అవకాశముందని, 7.5శాతం వడ్డీ చెల్లించబడుతుందని వివరించారు. రామచంద్రా మిషన్ అధ్యక్షులు కమలేష్ డి పాటిల్ మాట్లాడుతూ తమ మిషన్‌లో వితంతువుల కోసం 'దివ్య జనని' కార్యక్రమాలు చేపడుతు న్నామని తెలిపారు. తల్లి దండ్రులను ఎలా చూసుకోవాలి? పిల్లలను ఎలా పెంచాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కె.ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 'మహిళా సమ్నాన్ సేవింగ్ సర్టిఫికెట్' పథకానికి 1.74 కోట్ల మంది బాలిక లు, మహిళలు అర్హులుగా ఉన్నారని తెలిపారు. జూన్ వరకు ప్రతి మేజర్ పోస్టు ఆఫీసులో 200 ఖాతాలు, ఒక్కో బ్రాంచ్ పోస్టు ఆఫీసులో40 ఖాతాల ను లక్ష్యంగా పెట్టుకున్నామని వివరిం చారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రీజియన్ పోస్టు మాస్టర్ జనరల్ డాక్టర్. పి.విద్యాసాగర్‌రెడ్డి, హెడ్ క్వార్టర్ పోస్టు మాస్టర్ జనరల్ టీఎం.శ్రీలత, హెడ్ క్వార్టర్ పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్ కేఏ.దేవ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.