Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్దిపేట అభివృద్ధి తెరిచిన పుస్తకం
- కాళేశ్వరం నీళ్లతోనే కల్పతరువు
- సిద్దిపేట జిల్లాకు అర్బన్ మండలం హైటెక్ సిటీ : మంత్రి హరీశ్‌రావు
నవ తెలంగాణ - సిద్దిపేట అర్బన్
ప్రజల సంక్షేమమే పాలకులకు సగం బలమని ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో వచ్చిన కాళేశ్వరం నీళ్ల పుణ్యమా అని నేడు నియోజకవర్గ స్థాయిలో కష్టాలు పోయి కల్పతరువు వచ్చిందన్నారు. నియోజకవర్గస్థాయిలో నాడు రూ.30 కోట్ల పంట పండితే.. నేడు రూ.300 కోట్ల పంట పండుతుందన్నారు.
జిల్లావ్యాప్తంగా యాసంగిలో రూ.1,500 కోట్ల పంట కొనుగోలు చేయనున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు విలువ, గౌరవం పెరిగిందని తెలిపారు. సిద్దిపేట అభివృద్ధి తెరిచిన పుస్తకమని, కేసీఆర్ పథకాలు అందని ఇండ్లు ఉన్నాయా అని అన్నారు. నాడు ట్యాంకర్లతో నీళ్లు పోసుకుని బతుకమ్మలు వేసే వాళ్లమని, కనీసం చేపలు బతకడానికి కూడా నీళ్లు ఉండేవి కావని, నేడు ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి దూకుతూ నిండుకుండలా కనిపిస్తున్నా యన్నారు. సిద్దిపేట సర్కార్ దవాఖానలో అన్ని రకాల పరికరాలతో కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. జిల్లాకు అర్బన్ మండలం హైటెక్ సిటీగా మారిందన్నారు. జిల్లా నలుమూలల నుంచి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నామన్నారు. నంది ఎల్లయ్య ఐదు సార్లు గెలిచి రైలు తీసుకురాలేదని, కేసీఆర్ కృషితో సిద్దిపేటకు రైలు వచ్చిందని తెలి పారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు డప్పు చప్పుళ్లతో కోలాటాలతో తరలివచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ చీఫ్ వెంకటేశ్వరరావు, జెడ్పీ చైర్మెన్ రోజాశర్మ, సుడా చైర్మెన్ రవీందర్ రెడ్డి, ఎంపీపీ సవితా ప్రవీణ్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కమలాకర్‌రావు, కార్యదర్శి రవీందర్‌గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తుపాకుల బాల్ రంగం, ప్రవీణ్‌రెడ్డి, టీఆర్ఎస్ అర్బన్ మండల శాఖ అధ్యక్షులు ఎద్దు యాదగిరి, స్థానిక ప్రజాప్రతినిధులు, మిట్టపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు జేపీ యాదవ్, పాల్గొన్నారు.