Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలి
- ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హిమోఫిలియో రుగ్మత కలిగిన వారికి ప్రభుత్వం ఉచితంగా చికిత్సనందించాలనీ, జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని వికలాంగుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య, కోశాధికారి ఆర్ వెంకటేష్ డిమాండ్ చేశారు. అంతర్జాతీయ హిమోఫిలియా డే సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో అవగాహన దినోత్సవాన్ని ప్లకార్డులు పట్టుకుని నిర్వహించినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో హీమోఫిలియో వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ఏప్రిల్ 17న అంతర్జాతీయ హిమోఫిలియో అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. 1969లో ప్రపంచ హిమోపిలీయో ఫెడరేషన్‌ను ప్రారంభించిన ప్రాంక్ స్నాబెల్ పుట్టిన రోజు ఏప్రిల్ 17ను, 1989నుంచి అంతర్జాతీయ హైమోపిలియో డే గా జరుపుతున్నారని తెలిపారు. హిమోఫిలియో రుగ్మత ఉన్నట్టు చాలా మందికి తెలియదనీ, ఇది అంటూ వ్యాధి కాదని పేర్కొన్నారు. హీమోఫిలియో చికిత్స కేంద్రాల నిర్వహణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జే దశరథ్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి శశికళ, నాయకులు నందు, కవిత, చిట్టెమ్మ, శిరీష్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.