Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర సర్కార్
- కామారెడ్డి జిల్లాలో పాల్వంచ,
- జోగులాంబ-గద్వాల్ జిల్లాలో ఎర్రవల్లి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. కామారెడ్డి జిల్లాలో పాల్వంచ, జోగులాంబ-గద్వాల్ జిల్లాలో ఎర్రవల్లి మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిట్టల్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. గద్వాల్ రెవెన్యూ డివిజన్లోని ఇటిక్యాల మండలం నుంచి బొచువీరాపూర్, పుటాన్‌దొడ్డి, రాజాశ్రీగార్లాపాడు, కాప్రాకుల, సాసానూల్, ధర్మావరం, కొండేర్, వేముల, తిమ్మాపూర్లతో ఎర్రవల్లి మండలాన్ని ఏర్పాటు చేశారు. కామారెడ్డి రెవెన్యూ డివిజన్లోని మాచారెడ్డి మండలం నుంచి పాల్వంచ, ఎలుపుగొండ, వాడి, ఫరీద్‌పేట్, బండారామేశ్వర్పల్లి, ఇసాయిపేట్, దేవన్‌పల్లి, పొతారం, భవానిపేట్ గ్రామాలతోపాటు రామారెడ్డి మండలంలోని సింగాయిపల్లి గ్రామాన్ని కలిపి పాల్వంచ మండలాన్ని ఏర్పాటు చేశారు.