Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్పీహెచ్ఐసీ చైర్మెన్ కోలేటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పల్లె ప్రగతికి నిదర్శనమే రాష్ట్రానికి జాతీయ అవార్డులని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల వల్లనే జాతీయ స్థాయిలో రాష్ట్రం మరోసారి సత్తా చాటగలిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని పంచాయతీల అభివృద్ధితో పాటు, వాటి పరిధిలోని ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపర్చే దిశగా ప్రభుత్వం కార్యక్రమాలను అమలు చేసిందని తెలిపారు. ఫలితంగానే రాష్ట్రానికి జాతీయ అవార్డుల పంట పండుతున్నదని వివరించారు.