Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఈ నెల 25 వరకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయొద్దని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ సురేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ విచారణకు అవినాష్ సంపూర్ణంగా సహకరించాలని ఆదేశించింది. సీబీఐ దర్యాప్తును ఆడియో, వీడియో చిత్రీకరణ చేయాలంది. తన తండ్రి భాస్కర్‌రెడ్డిని కూడా సీబీఐ అరెస్టు చేసిందనీ, తనను కూడా సాక్షిగా విచారణకు పిలిచే సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని పిటిషనర్ లాయర్ వాదించారు. విచారణ తర్వాత తమ వద్ద ఉన్న ఆధారాల తర్వాతే భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేశామనీ, ఆదే విధమైన ఆధారాలుంటే అవినాష్ రడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని సీబీఐ వాదించింది. వివేకాకు వివాహేతర సంబంధం ఉన్నందునే హత్యకు గురయ్యార నేందుకు కారణాలు లేవని చెప్పింది. వివేకా హత్యకు గురైతే గుండెపోటు వల్ల చనిపోయారని అవినాష్ ఎందుకు చెప్పారో తేల్చాలని వివేకా కుమార్తె సునీత లాయర్ వాదించారు. వాదనల తర్వాత హైకోర్టు అవినాష్‌ను ఈ నెల 25 వరకు అరెస్టు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.