Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెవెన్యూ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్
- ట్రెసా ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్‌విందు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పవిత్రతకు, సోదరభావానికి ప్రతీక రంజాన్ అని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్‌మిట్టల్ అన్నారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ట్రెసా ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని సీసీఎల్ఏ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నవీన్ మిట్టల్ మాట్లాడుతూ రంజాన్ విశిష్టతను తెలిపారు. త్యాగానికి, సోదరభావానికి ప్రతీక రంజాన్ అని, ఈ మాసంలో ముస్లీం సోదరులంతా ఎంతో భక్తి శ్రద్దలతో ఉంటారని ఆయన తెలిపారు. మనషులంతా సమానమేనని, అందరూ సోదర భావంతో ఉండాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టెస్రా ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్‌కుమార్, సీసీఎల్ఏ సెక్రటరీ కె.హైమావతి, ప్రత్యేక అధికారి సత్యశారద, ట్రెసా అసోసియేట్ అధ్యక్షులు మన్నె ప్రభాకర్, సీసీఎల్ఏ యూనిట్ అధ్యక్షులు ఎల్లారెడ్డి, ట్రెసా ఉపాధ్యక్షులు బాణాల రాంరెడ్డి, కె.నిరంజన్‌రావ్, రాష్ట్ర నాయకులు రమేష్, నజీమ్‌ఖాన్, శ్రీకాంత్‌రెడ్డి, ఫహీంఖాద్రి, వివిధ జిల్లాల అధ్యక్షులు కె. రామకష్ణ, ఎండీ.వకీల్, సుధాకర్, సీసీఎల్ఏ యూనిట్ ముస్లిం సోదరులు, రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.