Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీహెచ్ డాక్టర్ జి.శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా బూస్టర్ డోస్ వేసే కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. ప్రపంచవ్యాప్తంగా, దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నా టీకాల పంపిణీ విషయంలో కేంద్రం బూస్టర్ డోస్ పంపిణీకి ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే డోసుల పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సిన్ కొరత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల కార్బెవ్యాక్స్ డోసులను సేకరించి సిద్ధంగా ఉంచింది. ఇప్పటికే కోవాగ్జిన్ లేదా కోవిషీల్ట్ లను మొదటి, రెండో డోసులుగా వేసుకున్న వారికి ప్రికాషనరీ డోసుగా దీన్ని వేయనున్నారు. మూడో డోసుగా దీన్ని వేసేందుకు కేంద్రం ఆమోదించింది. కాగా.... వ్యాక్సినేషన్ ప్రక్రియకు అంతరాయం కలగకుండా ఇప్పటికే అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు. డోసులు వేసుకోకుండా మిగిలిపోయిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీనివాసరావు ఈ సందర్భంగా కోరారు.