Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జనగామ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతించింది. 100 ఎంబీబీఎస్ సీట్లతో 2023-24 సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించుకునేందుకు అనుమతిస్తూ ఎన్ఎంసీ మెడికల్ అసెస్ మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (ఎంఏఆర్బీ) మెంబర్ ప్రెసిడెంట్ జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు లేఖ రాశారు. ఇటీవల ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్ మెడికల్ కాలేజీలకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాదికి గాను అనుమతి వచ్చిన కాలేజీల సంఖ్య ఐదుకు చేరాయి. మరో నాలుగు కాలేజీల అనుమతుల ప్రక్రియ చివరి దశలో ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జనగామ మెడికల్ కాలేజీకి అనుమతి రావడం పట్ల వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు.