Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రఘునందన్‌రావు ఆరోపణలు : మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు తనపై ఆరోపణలు చేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. రఘునందన్‌రావు ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఈమేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. నిజాన్ని తెలుసుకోకుండా రాజకీయ దురుద్దేశంతో చేసిన ఆరోపణలకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణానది పరివాహకాన్ని ఆక్రమించి, నిబంధనలు అతిక్రమించి తాను ఫామ్ హౌస్‌లు నిర్మించానంటూ రఘునందన్ రావు ఆరోపిస్తున్నారని విమర్శించారు. వనపర్తి జిల్లా చండూరు మండలంలో 80 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుని 160 ఎకరాల్లో ప్రహరీగోడ నిర్మించానని చెప్పడం సరైందికాదని పేర్కొన్నారు. 'మా స్వగ్రామం పాన్గల్లో నాకు ఉన్న భూములు 2014, 2018 ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నవే. ఎస్టీల పేరిట భూములు కొని మార్చుకున్నామన్న మాట అవాస్తవం. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు రఘునందన్ రంధ్రాన్వేషణ చేశారు. న్యాయంగా చట్టప్రకారం కొనుగోలు చేసిన దాని కన్నా ఒక్క గుంట ఎక్కువ ఉన్నా...ఆ భూముల్ని మా పిల్లలు వదిలేస్తారు. నేను నా పదవికి రాజీనామా చేస్తా. లేకుంటే అసత్య ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలి' అని సవాల్ విసిరారు.