Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిమాన్షురావుకు సీఎం దంపతుల ఆశీర్వాదం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉన్నత చదువులు చదివి జీవితంలో మరింతగా ఎదగాల నీ, సమాజానికి గొప్పగా సేవ చేయాలని హిమాన్షురావును సీఎం కేసీఆర్ దంపతులు ఆశీర్వ దించారు. మంగళవారం హైదరా బాద్లోని వోక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 12 క్లాస్ గ్రాడ్యు యేషన్ డే వేడుకలను నిర్వహించారు. సీఎం మనువడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షురావు 12 క్లాసు గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. వెంటనే పట్టాను కేసీఆర్ చేతుల్లో పెట్టి దీవెనలను తీసుకున్నారు. ఈ సందర్భంగా అతన్ని కేసీఆర్ అభినందించారు. క్రీడా, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో ప్రతిభ కనబర్చినవారికి ఇచ్చే అవార్డుల్లో 'కమ్యూనిటి యాక్టివిటీ సర్వీసెస్' (సీఎఎస్) విభాగంలో ఎక్స్లెన్స్ అవార్డును హిమాన్షురావు అందుకున్నారు. పట్టా పొందిన వారిలో బీఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల తనయుడు అద్విత్ బిగాల కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభమ్మ, మంత్రి కేటీఆర్, హిమాన్షు తల్లి శైలిమ, చెల్లెలు అలేఖ్య, అమ్మమ్మ, మేనమామలు, ఎమ్మెల్యే గణేశ్ బిగాల పాల్గొన్నారు.