Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏసీబీకి చిక్కిన సైట్ ఇంజనీర్
- వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఘటన
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సైట్ ఇంజనీర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కలెక్టరేట్ పంచాయతీరాజ్ విభాగంలో ఇర్ఫాన్ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సైట్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నవాబుపేట మండలం మదారం ప్రాథమిక పాఠశాలలో 'మన ఊరు-మన బడి' పనులకు సంబంధించి ప్రభు అనే వ్యక్తి కాంట్రాక్టుకు తీసుకున్నాడు. కాగా, ఈ పనులకు ఎస్టిమేషన్ కోసం కాంట్రాక్టర్ ప్రభును ఇర్ఫాన్ రూ. లక్ష లంచం డిమాండ్ చేశాడు. ప్రభు ఇప్పటి వరకు రూ.51 వేలు ఇవ్వగా, మరో రూ.50వేలు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ప్రభు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం ఇర్ఫాన్‌కు రూ.5 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఇర్ఫాన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కేసును విచారిస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ సత్యానారాయణ తెలిపారు.