Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తృటిలో తప్పించుకున్న బీజాపూర్ ఎమ్మెల్యే విక్రమ్ మండవి
నవతెలంగాణ-చర్ల
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ఛత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లా ఎమ్మెల్యే విక్రమ్ మండావి కాన్వాయ్‌పై మావోయిస్టులు మంగళవారం మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే తృటిలో తప్పించుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగులూరులో ఓ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ హాజరై తిరిగి బీజాపూర్ వస్తుండగా దండకారణ్యంలో మావోయిస్టులు కాపుకాసి హతమార్చేందుకు ప్రయత్నించారు. కాన్వారుపై మావోయిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు స్థానికులు తెలుపుతున్నారు. అయితే ఎంతో సమయస్ఫూర్తితో ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తప్పించుకున్నట్టు తెలుస్తోంది.